Preeti Case: పోలీసులకు సవాల్‌గా మారిన ప్రీతి మృతి కేసు

Preeti Case: మెడికో ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Dhatripriya
Published on: 6 March 2023 6:10 PM IST
Preeti Case Become Challenge To Police
X

Preeti Case: పోలీసులకు సవాల్‌గా మారిన ప్రీతి మృతి కేసు

Preeti Case: మెడికో ప్రీతి కేసు పోలీసులకు సవాత్ గా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు భావించినదానికి విరుద్ధంగా ప్రీతి టాక్సికాలజీ రిపోర్టు వచ్చింది. ప్రీతి శరీరంలో ఎలాంటి విషపదార్ధాలు లేవని రిపోర్టులో వెల్లడైంది. దీంతో ఆత్మహత్యయత్నం కేసును కాస్తా అనుమానాస్పద మృతిగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేందర్ మరోసారి కీలక కామెంట్స్ చేశారు. ప్రీతిది ఆత్మహత్య కాదని..ముమ్మాటికీ హత్యేనని అన్నారు. డీజీపీ అంజనీ కుమార్‌ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన..ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్షపడేలా చూడాలని డీజీపీని కోరనున్నట్లు వెల్లడించారు. మట్టెవాడ పోలీసులు నిన్న తన ఇంటికి వచ్చి విచారించారని చెప్పారు. జరిగిన ఘటనపై మరోసారి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు నరేందర్ వెల్లడించారు. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ అందలేదని నరేందర్ స్పష్టం చేశారు. ఒకవేళ టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చినా కాజ్ ఆఫ్ డెత్ క్లియర్‌గా తెలియదని ప్రీతి తండ్రి అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story