Hyderabad: ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ .. వీడియో వైరల్!

Hyderabad: కాబోయే కపుల్స్‌కు ఆల్‌దిబెస్ట్ చెబుతున్న మరికొందరు నెటిజన్లు

Jyothi
Published on: 9 Jan 2024 8:24 AM IST
Pre-Wedding Shoot In RTC Bus In Hyderabad Going Viral On Social Media
X

Hyderabad: ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ .. వీడియో వైరల్!

Hyderabad: ఇటీవల కాలంలో పెళ్లికంటే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్‌గా మారింది. కాబోయే దంపతులు జీవితంలో గుర్తుండిపోయేలా సినిమాల్లో మాదిరిగా అద్భుతమైన లొకేషన్లలో ఫొటోలు, వీడియోలతో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారు ఎంచుకుంటున్న లొకేషన్లు చర్చగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ఓ కాబోయే జంట ప్రీ వెడ్డింగ్ షూట్ జరపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్టీసీ బస్సులో ఫొటోషూట్ చేయడం పట్ల కొందరు నెటిజన్లు భిన్నరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇటువంటి వీడియో షూట్‌ల వల్ల రోడ్డు భద్రతకు ఆటంకం కలుగుతుందని...కొందరు నెటిజన్లు మండిపడుతుంటే నగరంలో ఉన్న మిలియన్ ట్రాఫిక్ సమస్యల్లో ఇదో సమస్యే కాదని, మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jyothi

Jyothi

Next Story