Prashanth Reddy: మంత్రి బొత్స కరెంటు బిల్లు కట్టలేదేమో..

Prashanth Reddy: ఏపీలో కరెంట్ కష్టాలు, సమస్యలపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు మంత్రి వేముల

Arun Chilukuri
Published on: 29 April 2022 5:46 PM IST
Prashanth Reddy Slams Botsa Satyanarayana
X

Prashanth Reddy: మంత్రి బొత్స కరెంటు బిల్లు కట్టలేదేమో..

Prashanth Reddy: ఏపీలో కరెంట్ కష్టాలు, సమస్యలపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఉంటున్న మంత్రి బొత్స కుటుంబం బహుశా కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్లే వారి ఇంటికి పవర్ సప్లై కట్ చేసి ఉంటారని ఆరోపించారు. మంత్రి బొత్స ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్న వేముల కేటీఆర్ ఆంద్రప్రదేశ్ గురించి ఉన్న నిజం మాత్రమే అన్నారు.

రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు కాబట్టే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. ఆంద్రప్రదేశ్ ను అభివృద్ధి చేసుకుంటే మేమైనా అడ్డుపడుతున్నామా? అని ప్రశ్నించిన వేముల విజయవాడ నుంచి రియలేస్టేట్ వ్యాపారులు అంతా వస్తున్న విషయం ఏపీ మంత్రులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‎లో - రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయా లేదా ప్రజలకు తెలుసన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story