TS News: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రశాంత్ కిషోర్ భయం..?

TS News: టీఆర్‌ఎస్‌లో 40మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్స్...

Shireesha
Published on: 18 March 2022 7:58 AM IST
Prashant Kishor Tension to TRS MLAs | Telangana News Today
X

TS News: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రశాంత్ కిషోర్ భయం..?

TS News: తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. దీంతో పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లాయి. టీఆర్ఎస్‌ అయితే ఒక అడుగు ముందుకేసి అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యాలయాల ఓపెనింగ్స్ పేరిట బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు గులాబీ ఎమ్మెల్యేలకు ఓ అంశం టెన్షన్ పుట్టిస్తోంది.

కొన్ని నెలలుగా ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ బృందం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వేల పేరిట హడావుడి చేస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందిన నివేదికల ప్రకారం 40 మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు ప్రతీ ఉమ్మడి జిల్లాలోనూ నలుగురైదుగురు ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయిందని ఐప్యాక్ బృందం తమ సర్వేలో తేల్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాట పట్టారు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ భయంతోనే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో సెట్ రైట్ చేసుకునే పనిలో పడ్డారని సమాచారం. అంతేకాదు పీకేను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.

Shireesha

Shireesha

Next Story