తెలంగాణ వ్యాప్తంగా పీకే టీమ్ ఐప్యాక్ సర్వేలు..ఆ 40 మందికి వార్నింగ్ ..

తెలంగాణ వ్యాప్తంగా పీకే టీమ్ ఐప్యాక్ సర్వేలు..ఆ 40 మందికి వార్నింగ్ ..
x

తెలంగాణ వ్యాప్తంగా పీకే టీమ్ ఐప్యాక్ సర్వేలు..ఆ 40 మందికి వార్నింగ్ ..

Highlights

Telangana: ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరుపై సీఎం‌కి పీకే రిపోర్ట్

Telangana: గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు. ఏడేళ్లుగా రాని విన్పించని మాటలు ఇప్పుడు టీఆర్ఎస్ నేతల స్వరాల నుంచి బయటకు వస్తున్నాయ్. వరుసగా రెంటు టర్మ్ లు అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందోనన్న వర్రీలో ఉన్న టీఆర్ఎస్‌కు తాజాగా ఎన్నికల స్ట్రాటజిస్ట్ పీకే ఇచ్చిన రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీకే టీమ్ ఐప్యాక్ సర్వేలు నిర్వహిస్తోంది. ఆ రిపోర్టులో ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరును పీకే వివరించారు. మొత్తం టీఆర్ఎస్ పార్టీల్లో ఉన్న 40 శాతం ఎమ్మెల్యేల పని తీరు బాగాలేదని పీకే రిపోర్ట్ ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయ్.

వచ్చే ఎన్నికల నాటికి పని తీరు మార్చుకుంటే మరోసారి విజయం సాధించొచ్చని లేదంటే ఇబ్బందులు తప్పవన్న వర్షన్ పీకే సీఎం కేసీఆర్‍‌‌కు వివరించినట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా టఫ్ సిచ్యువేషన్ ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన వివరాలను పీకే సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు సూచనలను పీకే సూచించినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు ఐప్యాక్ కు ప్రశాంత్ కిషోర్ దిశానిర్దేశం చేయగా ఇకపై ఐప్యాక్ సంస్థ నేరుగా టీఆర్ఎస్‌కు సూచనలు సలహాలు చేయనుంది. ఎమ్మెల్యేల పని తీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories