ప్రశాంత్ తో డీల్ అంటే కోట్లల్లోనేనా.. ఐప్యాక్ లో చీలికలొచ్చాయా?

Prashant Kishor New Strategy For AP and Telangana
x

ప్రశాంత్ తో డీల్ అంటే కోట్లల్లోనేనా.. ఐప్యాక్ లో చీలికలొచ్చాయా?

Highlights

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ పర్సన్.

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ పర్సన్. గెలుపు మంత్రం రచించే వ్యూహకర్త ఎన్నికల రణక్షేత్రంలో ప్రత్యర్ధులను మట్టి కరిపించి కోరుకున్నపార్టీకి పట్టాభిషేకం చేయించే దిట్ట. తెలుగు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు పీకే టీమ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది?

ఆయన గెలుపు మంత్రం తెలిసిన వ్యూహకర్త. పార్టీల తలరాతలను మార్చే అపర బ్రహ్మ. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలనుకుంటే ఆయన్ను స్ట్రాటజిస్ట్ గా పెట్టుకోడం ఆనవాయితీ. దేశ చరిత్రలో ఎన్నో పార్టీల తలరాతలు మార్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన పట్టు పట్టాడంటే వెంట్రుక వాసిలో తప్పిపోయే ఓటమి కూడా ఘన విజయానికి దారితీస్తుంది. బీజేపీ కి, వైసీపీకి, మమతకి విజయాలను సాధించి పెట్టిన చరిత్ర ప్రశాంత్ ది. ఈసారి కూడా ప్రశాంత్ కిషోర్ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలను మరోసారి గెలిపించేందుకు కంకణం కట్టుకున్నాడు.

ఐఐటియన్ అయిన ప్రశాంత్ ఏదైనా విషయంలో స్కెచ్ వేశారంటే అది సక్సెస్ అవ్వాల్సిందే. అందుకే ఆయనతో డీల్ అంటే అది కోట్లల్లో విషయమే గత ఎన్నికల్లో వైసీపీ ప్రశాంత్ కు 700 కోట్లకు పైగానే ఫీజు చెల్లించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఏపీలో వైసీపీకి తిరుగులేని విజయం సాధించి పెట్టినది ప్రశాంత్ టీమ్ వ్యూహరచనే. ఈసారి ఆ టీమే మరోసారి వైసీపీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుంటోంది. ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న జగన్ మిగిలిన కాలానికి మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నారు. విన్నింగ్ టీమ్ ను ఎంపిక చేసుకోవాలని, ఈ రెండున్నరేళ్లు జనరంజక పాలన చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఈసారి మంత్రివర్గ విస్తరణలో కూడా ప్రశాంత్ మార్క్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ప్రశాంత్ టీమ్ ఇటు తెలంగాణలో కేసీఆర్ పార్టీకి గెలుపు మంత్రం రచించే పనిలో పడింది. ప్రశాంత్ డబ్బులకు పనిచేసే వ్యక్తి కాదంటున్నారు కేసీఆర్. కానీ టీఆర్ ఎస్ పార్టీ కి ప్రశాంత్ టీమ్ కి మధ్య 300 కోట్ల డీల్ కుదిరిందన్న పుకార్లు మాత్రం వినిపిస్తున్నాయి. మనీ మేటర్స్ ఎలా ఉన్నా ప్రశాంత్ టీమ్ తమకు పనిచేస్తున్నట్లు కేసీఆర్ థృవీకరించారు. ఇప్పటికే ప్రశాంత్ కు చెందిన ఐప్యాక్ టీమ్ తెలంగాణ అంతటా పథకాల అమలును అధ్యయనం చేస్తోంది. ఎమ్మెల్యేల పనితీరునూ సర్వే చేస్తోంది. ఎన్నికలలో గెలుపు టీమ్ ను సెలక్ట్ చేసే బాధ్యత ఈ స్ట్రాటజిస్ట్ పై ఉండటంతో ఆశావహులంతా ప్రశాంత్ కరుణకోసం ఎదురు చూస్తున్నారు.

ప్రశాంత్ టీమ్ వర్క్ లో క్షేత్ర స్థాయి అధ్యయనమే కీలకం. ఆయన సర్వేలు పక్కా వందశాతం రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఉంటాయి. ప్రజల మధ్య చేసే సర్వేలో ఆయన క్వశ్చనీర్ డిజైనింగ్ లోనే అంతా ఉంటుంది. సాధారణంగా ఎన్నికలకు ఆరునెలల ముందు రంగంలోకి దిగే ప్రశాంత్ టీమ్ అప్పటి నుంచి నెలవారీ, పక్షం వారీ, వారం వారీ సర్వేలు నిర్వహిస్తూ పబ్లిక్ పల్స్ ఎలా మారుతోందో తెలుసుకుంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ సర్వేల టైమ్ గ్యాప్ తగ్గుతూ వస్తుంది. నాల్గు రోజులకు, రెండురోజులకు చివరి దశకు వచ్చే సరికి రోజు వారీ సర్వేలు కూడా మొదలవుతాయి. సమాజాన్ని కులాల వారీగా, వర్గాల వారీగా,మతాల వారీగా గణాంకాలతో అధ్యయనం చేస్తుంది ప్రశాంత్ టీమ్. ఆయా ఓటు బ్యాంకుల అవసరాలు, ప్రాధాన్యతలు గుర్తించి మేనిఫెస్టోలను రూపొందిస్తుంది. ఒకసారి ప్రశాంత్ టీమ్ తో డీల్ కుదిరిందంటే. ఇక సమస్తమూ వారి అధీనంలోకి వెళ్లిపోతుంది.

ప్రశాంత్ టీమ్ లో ఉన్నవారంతా ఐఐటియన్స్ సర్వేలు చేయడంలో దిట్టలు. సుదీర్ఘ సమయం క్షేత్రస్థాయిలో గడపడం ప్రజల మధ్య ఉంటూ పబ్లిక్ పల్స్ ను అంచనా వేస్తుంటారు. వారికి జీతాలు, ఇతర అలవెన్సులు కూడా లక్షల్లోనే ఉంటాయి. ఎన్నికల ప్రచార సరళిని, తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది ప్రశాంత్ టీమ్. పార్టీ వ్యూహం పరంగా మార్పులు చేర్పులపై అధినేతకు క్షణాల్లో సమాచారం అందిస్తుంది. ఎన్నికల వాగ్దానాలు, మేనిఫెస్టో డిజైనింగ్, చివరకు ఎన్నికల ప్రచారంలో వాడే ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా పబ్లిసిటీ అన్నీ మొత్తం ప్రశాంత్ టీమే చూసుకుంటుంది.

రాష్ట్ర సామాజిక, సాంఘీక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను, ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని సర్వేలు చేయడం వల్ల నిర్దిష్ట ఫలితాలను ఈ టీమ్ అంచనా వేయగలుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సక్సెస్ చాలా మంది యువ ఐఐటియన్లను ఈ కెరీర్ పై దృష్టి పెట్టేలా ఆలోచింప చేస్తోంది. అటు రాజకీయ పార్టీలనూ ఆకర్షిస్తోంది.ప్రశాంత్ తో గతంలో పనిచేసిన కొందరు టీమ్ సభ్యులు ఇప్పుడు వేరు కుంపటి పెట్టుకుని ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. తెలంగాణలో ప్రశాంత్ టీమ్ మేట్స్ కొందరు విడిపోయి కాంగ్రెస్ కు గెలుపు వ్యూహం రచించేందుకు రెడీ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా ఎలక్షన్ స్ట్రాటజీస్ ప్లానింగ్ ఇప్పుడు లాభదాయకమైన బిజినెస్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories