Raj Bhavan: నేడు రాజ్ భవన్ లో ప్రజాదర్భార్

Raj Bhavan: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాదర్భార్

Rama Rao
Published on: 10 Jun 2022 9:21 AM IST
Prajadarbhar Today At Raj Bhavan | Telangana News
X

Raj Bhavan: నేడు రాజ్ భవన్ లో ప్రజాదర్భార్

Raj Bhavan: తెలంగాణ గవర్నర్ తమిళిసై తొలిసారిగా ప్రజాదర్భార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కరానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. రాజ్ భవన్ వేదికగా నిర్వహించనున్న ప్రజాదర్బార్ ను గవర్నర్ ప్రారంభించనున్నారు. ముఖ్యంగా రాష్ర్టంలో ఇటీవలి కాలంలో మహిళలలపై అఘాయిత్యాలు, వరుస అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళల సమస్యలు వినాలని గవర్నర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మొదటగా మహిళా దర్భార్ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మధ్యహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రజా దర్భార్ నిర్వహించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story