Hyderabad: హైదరాబాద్‌లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు

Posters Flexes Against Modi in Hyderabad
x

Hyderabad: హైదరాబాద్‌లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు

Highlights

Hyderabad: కవిత ఈడీ విచారణ నేపథ్యంలో వెలసిన పోస్టర్లు

Hyderabad: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవనున్న నేపథ్యంలో హైదరాబాదులో పోస్టర్లు వెలిశాయి. బీజేపీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లతో పాటు గోడలపై పోస్టర్లు వేశారు. బీజేపీలో చేరకముందు, బీజేపీలో చేరిన తర్వాత అంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బీజేపీలో చేరిన కొందరు నేతల ఫోటోలతో ఈ పోస్టర్లు అతికించారు. పోస్టర్లలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బిజెపి నేత సువేందు అధికారి, ఏపీకి చెందిన ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలు ఉన్నాయి.

వీరంతా సీబీఐ, ఈడీ రైడ్స్ తర్వాత బీజేపీలో చేరారని.. కానీ ఎమ్మెల్సీ కవిత ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. నిజమైన రంగులు వెలసిపోవు అనే కొటేషన్‌తో పాటు.. బై బై మోడీ అంటూ హాష్ టాగ్‌లు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories