Hyderabad: బేగంపేటలో ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు

Hyderabad: మెట్రో పిల్లర్లపై అతికించిన గుర్తుతెలియని వ్యక్తులు

Jyothi
Published on: 19 March 2023 9:03 AM IST
Posters Against MLC Kavitha in Begumpet
X

Hyderabad: బేగంపేటలో ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు 

Hyderabad: హైదరాబాద్ లో మరోసారి పొలిటికల్ పోస్టర్లు కలకలం రేపాయి. ఇటీవల కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి.హైదరాబాద్ బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. శనివారం ఈ పోస్టర్లు కనిపించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను కవిత ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ పోస్టర్లు మెట్రో పిల్లర్లపై కనిపించడం కలకలం రేపుతోంది. పోలీసులు వెంటనే పోస్టర్లను తొలగించారు. సీసీ కెమెరాలను పరిశీలించి.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా, ఇప్పుడు కవితకు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లలో ఎక్కడా ఊరు పేరు లేకపోవడం గమనార్హం.

Jyothi

Jyothi

Next Story