Ponnam Prabhakar: పొద్దున లేస్తే మాంసం, మద్యం లేకుండా బతకని బండి సంజయ్.. భక్తి గురించి మాట్లాడటం హాస్యాస్పదం

Ponnam Prabhakar Hot Comments On Bandi Sanjay
x

Ponnam Prabhakar: పొద్దున లేస్తే మాంసం, మద్యం లేకుండా బతకని బండి సంజయ్.. భక్తి గురించి మాట్లాడటం హాస్యాస్పదం

Highlights

Ponnam Prabhakar: బండి సంజయ్ నా దయతో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాడు-

Ponnam Prabhakar: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ మధ్య మాటల వివాదం ముదురుతోంది. ఇరువురి నేతల మధ్య రోజుకో చర్చ జరుగుతూనే ఉంది. లేటెస్ట్‌గా మంత్రి పొన్నం ప్రభాకర్, బండి సంజయ్‌పై హాట్ కామెంట్స్ చేశారు. రాముడి గురించి అనని మాటలు అన్నట్లు క్రియేట్ చేశారని ఫైర్ అయ్యారు పొన్నం. తాను ఆ మాటలు అన్నట్లు నిరూపిస్తే సజీవదహనం చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బతికి ఉన్న తన తల్లి గురించి తప్పుడు మాటలు మాట్లాడిన బండి సంజయ్.. మళ్లీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన రాజకీయ సన్యాసం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. తన దయతోనే బండి సంజయ్‌ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాడని ఆరోపించారు మంత్రి పొన్నం. పొద్దున లేస్తే మాంసం, మద్యం లేకుండా బతకని బండి సంజయ్.. భక్తి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని తీవ్ర ఆరోపణలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories