Ponnam Prabhakar: హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: నియోజకవర్గ అభివృద్దే లక్ష్యమన్న పొన్నం

Jyothi
Published on: 25 Aug 2023 2:19 PM IST
Ponnam Prabhakar as Husnabad Congress Candidate
X

Ponnam Prabhakar: హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్టు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ లోని సిద్దేశ్వరాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా తాను బరిలో ఉంటున్నట్టు పేర్కొన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఆశించినంతగా హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ పనితీరు బాగోలేక నియోజకవర్గ అభివృద్ధి వెనుకబడిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాంధీభవన్ లో దరఖాస్తు చేస్తున్నానని వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story