Ponnala - కాళేశ్వరంతో ఉపయోగం లేదని సోషియో ఎకనామిక్ సర్వే తేల్చింది

Ponnala Lakshmaiah: ప్రచార ఆర్భాటం, అబద్ధాలతోనే కేసీఆర్ పాలన సాగుతోందని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

Arun Chilukuri
Updated on: 9 July 2021 3:48 PM IST
Ponnala Lakshmaiah Slams on CM KCR
X

పొన్నాల లక్ష్మయ్య(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Ponnala Lakshmaiah: ప్రచార ఆర్భాటం, అబద్ధాలతోనే కేసీఆర్ పాలన సాగుతోందని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కాళేశ్వరంలో గతేడాది పంపింగ్ చేసిన ఒక్క చుక్క నీరు కూడా రైతాంగానికి ఉపయోగపడలేదన్నారు. కాళేశ్వరంతో ఉపయోగం లేదని సోషియో ఎకనామిక్ సర్వే తేల్చిందన్న పొన్నాల లక్ష కోట్లు ఖర్చుచేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. ఇప్పుడు కొత్తగా జల రాజకీయంతో లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారని పొన్నాల మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story