Ponnala Lakshmaiah: టీ.కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా..!

Ponnala Lakshmaiah: ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు.

Shekhar G
Published on: 13 Oct 2023 1:51 PM IST
Ponnala Lakshmaiah Resigned For Congress Party
X

Ponnala Lakshmaiah: టీ.కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా..!

Ponnala Lakshmaiah: ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోన్న వేళ అసహనంలో పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Shekhar G

Shekhar G

Next Story