Ponnala Lakshmaiah: అనుభవరాహిత్యం, అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్.. చరిత్రలోనే..

Ponnala Lakshmaiah: అనుభవ రాహిత్యం, అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్ అని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 28 July 2022 4:37 PM IST
Ponnala Lakshmaiah Open Challenge To CM KCR
X

Ponnala Lakshmaiah: అనుభవరాహిత్యం, అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్.. చరిత్రలోనే..

Ponnala Lakshmaiah: అనుభవ రాహిత్యం, అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్ అని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. ప్రపంచంలో అత్యంత అన్ని విభాగాల్లో నిపుణత సాధించిన రాజకీయ నాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ కాళేశ్వరం రీడిజైన్ చేసి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న మొదటి రోజే చెప్పామని కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల పంట పండించిందన్నారు.

ఒక్క ఎకరానికైనా చుక్క నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. లక్ష కోట్ల ప్రజా ధనం గోదారి, సముద్రం పాలైందని మండిపడ్డారు. నిరర్ధక ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ చరిత్రలోనే నిలిచిపోతాడని ఆరోపించారు. మల్లన్నసాగర్‌లో 50 టీఎంసీలు నింపే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. డిజైన్ లోపం బయటపడుతుందనే ప్రాజెక్టుల దగ్గరికి ఎవర్నీ పోనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల దగ్గర తామేమైనా బాంబులు పెడుతామా? అంటూ నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story