Ponnala Lakshmaiah: గాంధీ భవన్ ఓటింగ్ సిబ్బందిపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం

Ponnala Lakshmaiah: శ్రీనివాస్ రెడ్డి ప్లేస్‌లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వడం పట్ల పొన్నాల ఆగ్రహం

Jyothi
Published on: 17 Oct 2022 12:39 PM IST
Ponnala Lakshmaiah Fire On Gandhi Bhavan Staff
X

గాంధీ భవన్ ఓటింగ్ సిబ్బందిపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం

Ponnala Lakshmaiah: ఏఐసీసీ అధ్యక్ష్య ఎన్నికల సందర్భంగా జనగామ కాంగ్రెస్ వర్గ పోరు బయటపడింది. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ నియోజక వర్గం డెలిగేట్ ఓట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రతీ నియోజక వర్గం నుంచి ఇద్దరికి ఓటు వేసే అవకాశం ఉంది. జనగామ నుంచి ఇప్పటికే ఇద్దరికి ఏఐసీసీ ఓటింగ్ కార్డ్ జారీ చేసింది. జనగామ నుంచి పొన్నాల , చెంచారపు శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఏఐసీసీ కల్పించింది. గాంధీ భవన్ పోలింగ్ బూత్ కు పొన్నాల, శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. చివరి క్షణంలో ఓటరు జాబితాలో చెంచారపు శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగింగారు. ఆయన స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును నిన్న రాత్రి చేర్చారు. చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ఓటు వేయడానికి వచ్చారు. లాస్ట్ మినిట్ లో కొమ్మూరి పేరు చేర్చడం పట్ల పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్లపై పొన్నాల మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని పొన్నాల డిమాండ్ చేశారు. పొన్నాలకు జానారెడ్డి సర్ది చెప్పారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా పీయార్వో ఆపివేశారు.

Jyothi

Jyothi

Next Story