Khammam: పోలీసులపై పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు.. తొక్కిపట్టి నార తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వార్నింగ్‌

Khammam: పోలీసులనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

Arun Chilukuri
Updated on: 21 July 2023 7:15 PM IST
Ponguleti Srinivasa Reddy Slams Police
X

Khammam: పోలీసులపై పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు.. తొక్కిపట్టి నార తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వార్నింగ్‌

Khammam: పోలీసులనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పోలీసులను పింక్‌ కలర్‌ చొక్కా తొడుక్కోమని చెప్పండని ఫైర్‌ అయ్యారు. ఇటీవల ఖమ్మం గోపాలపురంలో ఓ కిరాణాషాపుపై గంజాయి మత్తులో కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను పొంగులేటి పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి ఎదుట బాధితులు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీపీ విష్ణు వారియర్‌, ఏసీపీ, సీఐలకు నేరుగా పొంగులేటి ఫోన్‌ చేయగా.. వారు అందుబాటులోకి రాలేదు. అయితే.. రౌడీలకు భయపడొద్దని.. వాళ్లను తొక్కిపెట్టి నార తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఎంతమందిని చంపుతారో చంపనీ చూద్దామంటూ విరుచుకుపడ్డారు. ఇంకెన్నో రోజులు లేవని, టైమ్‌ దగ్గర పడిందంటూ మండిపడ్డారు. ఎవరూ అధైర్య పడొద్దని, బాధితులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 20వేల రూపాయల ఆర్థికసాయాన్ని అందించారు పొంగులేటి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story