Ponguleti: నిరుద్యోగ యువతను కేసీఆర్ ఆగం చేశారు

Ponguleti: అంకెల గారడీతో యూనివర్సిటీలను కేసీఆర్ గంగలో కలిపారు

Jyothi
Published on: 18 May 2023 8:44 AM IST
Ponguleti Srinivasa Reddy Comments On KCR
X

Ponguleti: నిరుద్యోగ యువతను కేసీఆర్ ఆగం చేశారు

Ponguleti: తెలంగాణ సాధించుకుంటే... మన యువతకు మన ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ మోసంచేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. యువత మేలు కోవాలని, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారలని పొంగులేటి కోరారు. రఘునాథ్ యాదవ్ భవిష్యత్లో మాతో కలసి ప్రయాణం చేస్తారి..రాష్ట్ర రాజకీయాల్లో యువత యక్టివ్ గా ఉండాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

శేరిలింగంపల్లి నియోజక వర్గం ఎల్లమ్మ బండలో మారబోయిన రఘునాథ్ యాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన ఓ యువత మేలుకో కార్యక్రమంలో ఖమ్మం మాజీ పార్లెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పిడమర్తి రవితో పాటు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో యువత రాజీయాల్లోకి ముందుకు రావాలని.. రఘునాథ్ యాదవ్ కోరారు.

విద్యార్థుల పోరాటం, త్యాగాలతో తెలంగాణసాధించుకుని వాళ్లకు న్యాయం జరగలేదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. బంగారు తెలగాణగారూపుదిద్దుకుంటుందని, ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని అనుకున్నాం.. బడ్జెట్లో అంకెలు చూపించిన అన్ని యూనివర్సిటీలను కేసీఆర్ గంగలో కలిపారని మండిపడ్డారు. వైద్య, విద్యారంగాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ కి అడ్డాగా మార్చిన ఘనత కేసీఅర్ కి దక్కిందిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story