Ponguleti: బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించడమే లక్ష్యం

Ponguleti: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలనకు ప్రజలే బుద్ది చెబుతారు

Jyothi
Published on: 23 July 2023 9:13 AM IST
Ponguleti Srinivasa Reddy Comments On BRS
X

Ponguleti: బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించడమే లక్ష్యం

Ponguleti: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బిఅర్ఎస్ పార్టీ నేతలు చేసిన దందా లను నడిరోడ్డుపై కక్కిస్తామని మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మొదటి సారిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి చేరుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. భారీ ర్యాలీ నిర్వహించారు.

విద్యార్థుల బలిదానాలతో స్పందించిన సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ తెలంగాణను ఇష్టారీతిన దోచుకుంటున్నారని విమర్శించారు.అధికార మదంతో కాంగ్రెస్ పార్టీని చులకన చేసి మాట్లాడుతున్నారని ఆయన మండి పడ్డారు. కేసీఆర్ కు ప్రజలే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ చిత్తుగా ఓడిస్తామని శపధం చేశారు.

Jyothi

Jyothi

Next Story