Ponguleti Srinivas Reddy: కొత్తగూడెం సభలో కేసీఆర్ చిట్టా విప్పుతా

Ponguleti Srinivas Reddy: మాయమాటలతో కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు

Jyothi
Published on: 8 April 2023 5:30 PM IST
Ponguleti Srinivas Reddy Comments On KCR
X

Ponguleti Srinivas Reddy: కొత్తగూడెం సభలో కేసీఆర్ చిట్టా విప్పుతా

Ponguleti Srinivas Reddy: సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కొత్తగూడెం సభలో కేసీఆర్ చిట్టా విప్పుతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రం తెలంగాణను కేసీఆర్ దివాళా తీయించారని మండిపడ్డారు. మాయమాటలతో కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని.. మూడో సారి అధికారంలో వస్తానని కేసీఆర్ కలగంటున్నారని ఎద్దేవా చేశారు.

మాయమాటలతో అధికారంలోకి వచ్చిన వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలను పొంగులేటి కోరారు. రెండు జాతీయ పార్టీల ముఖ్య నాయకులు తనతో టచ్‌లో ఉన్నాట్లు చెప్పారు. TSPSC పేపర్ లీక్ కేసులో విచారణ సజావుగా సాగడం లేదంటూ పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story