Ponguleti Srinivasa Reddy: అధికారం ఎవడి సొత్తు కాదు.. ప్రతి మండలానికి కార్యాలయం..

Ponguleti Srinivasa Reddy: అధికారం ఎవడి సొత్తు కాదు..

Arun Chilukuri
Published on: 17 Feb 2023 7:48 AM IST
Ponguleti Srinivas Reddy Attack on KCR Govt
X

Ponguleti Srinivasa Reddy: అధికారం ఎవడి సొత్తు కాదు.. ప్రతి మండలానికి కార్యాలయం..

Ponguleti Srinivasa Reddy: అధికారం ఎవడి సొత్తు కాదని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనదే విజయం అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మీరు కలలు కన్న ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో నూతన క్యాంప్ కార్యాలయాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. పాయం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి మండలానికి కార్యాలయం ప్రారంభిస్తామని పొంగులేటి తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఉన్న మీ అభిమానం నన్ను వీడి పోలేదని తన వెంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story