Telangana Politics: కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి..!

Telangana Politics: మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Jyothi
Published on: 6 Jun 2023 1:51 PM IST
Ponguleti and Jupally into Congress
X

Telangana Politics: కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి..!

Telangana Politics: మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 25 లేదా 26న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక వచ్చే అవకాశం ఉంది. ఈ సభలో ఇరువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. అనుచరులతో సహా పొంగులేటి, జూపల్లి.. అగ్రనేతల సమక్షంలోనే హస్తం గూటికి చేరనున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈ ఇరువురి నేతలతో గత కొంత కాలంగా చర్చలు జరుపుతున్నా.. ఏ పార్టీలో చేరుతున్నారనే దానిపై పొంగులేటి, జూపల్లి క్లారిటీ ఇవ్వలేదు. అయితే, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ టీం ఇటీవల పొంగులేటితో చర్చలు జరిపారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మెుగ్గు చూపుతున్నారనే ప్రచారం జరిగింది.

గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని జూపల్లి, పొంగులేటి.. ఇప్పుడు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పొంగులేటి పలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలతో బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఏకతాటిపైకి తీసుకురావాలనేది పొంగులేటి, జూపల్లి వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఖమ్మంలో కాంగ్రెస్‌ బలంగా ఉండటం, కర్ణాటక గెలుపుతో రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉండటంతో హస్తం పార్టీలో చేరాలని పొంగులేటి, జూపల్లి నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story