Agency Polling: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

Agency Polling: అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

Shekhar G
Published on: 30 Nov 2023 4:00 PM IST
Polling Ends In Maoist Affected Areas
X

Agency Polling: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

Agency Polling: తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండటంతో.,. రాష్ట్రంలోని 13 అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తైంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్‌.. మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం.. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 58.38 శాతం పోలింగ్ నమోదవగా... కొత్తగూడెం నియోజకవర్గంలో 49.7, భద్రాచలం నియోజకవర్గంలో 63, పినపాక నియోజకవర్గంలో63, ఇల్లందు నియోజకవర్గంలో 56.9, అశ్వారావుపేట నియోజకవర్గంలో 63.75 శాతం పోలింగ్ నమోదైంది.

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో 65.. చెన్నూరులో 60.7 శాతం..మంచిర్యాలలో 54.36 శాతం పోలింగ్ నమోదైంది.

Shekhar G

Shekhar G

Next Story