KTR: మతం పేరు మీద రాజకీయం చేయలేదు

KTR: పేదవాడు ఏ మతస్తుడైనా కూడా మనిషి లాగా చూసి..

Shashank Gullapelli
Published on: 29 March 2024 8:52 AM IST
Politics Is Not Done In The Name Of Religion Says KTR
X

KTR: మతం పేరు మీద రాజకీయం చేయలేదు

KTR: రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్‌, బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. కేసిఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా మతం పేరు మీద రాజకీయం చేయలేదని కేటీఆర్ అన్నారు. పేదవాడు ఏ మతస్తుడైనా కూడా మనిషి లాగా చూసి వారికి కావలసిన వసతులు కేసిఆర్ అందించారని ఆయన అన్నారు. గత పది సంవత్సరాలలో దేశవ్యాప్తంగా మతకల్లోహాలు అల్లర్లు జరిగినా, కేసిఆర్ పాలనలో తెలంగాణలో మాత్రం అన్ని మతాలవారు గంగాజమున తహజీబ్ వలే కలిసి ఉన్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధి కావాలన్నా, శాంతి రావాలన్నా, కేసిఆర్ లాంటి నేత చాలా అవసరమని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story