Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు..

Suryapet: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది.

Arun Chilukuri
Published on: 10 Dec 2025 11:49 AM IST
Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు..
X

Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు.. 

Suryapet: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు ముప్పేట దాడి చేశారు. కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు మోహరించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story