గ్రేటర్ వరంగల్ ఎన్నికల కోసం మొదలైన పార్టీల హంగామా !

గ్రేటర్ వరంగల్ ఎన్నికల కోసం మొదలైన పార్టీల హంగామా !
x
Highlights

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలకు పదను పెడుతున్నాయి. ఓట్ల పండగకు కావాల్సిన సరుకు,...

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలకు పదను పెడుతున్నాయి. ఓట్ల పండగకు కావాల్సిన సరుకు, సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే5 నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంతో వరంగల్‌లో ఎన్నికల హడావుడి మొదలుపెట్టారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు ఎత్తులు వేస్తున్నాయి. తమ పార్టీ మేనిఫెస్టోలతో ప్రజలను ఆకర్షించేందుకు సంసిద్ధం అవుతున్నారు.

తెలంగాణలో హైదరాబాద్‌తో సహా మరో మూడు కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, సిద్దిపేటలలో 2021 జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికల నగారా మోగనుంది. దీనికోసం హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం గ్రేటర్ వరంగల్ అక్కడ అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అప్పుడే పనులు మొదలు పెట్టాయి. తెలంగాణలో సెమి ఫైనల్స్ గా చెప్పుకునే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు గెలిచి ఫైనల్ రేసులో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌లో 6 కార్పొరేషన్‌లలో ప్రస్తుతం 58 డివిజన్స్ ఉన్నాయి. అందులో రిజర్వేషన్ల వారీగా ఎస్టీలకు 2 స్థానాలు, ఎస్సీలకు 9, బీసీలకు 19, మహిళలకు 15, జనరల్ 13 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 44, కాంగ్రెస్ 4, బీజేపీ 01, ఇండిపెండెంట్స్ 9 మంది గెలుపొందారు.

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ అభివృద్ధి మంత్రాన్ని ప్రధాన అస్త్రంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అధికార పార్టీ చేసిన తప్పిదాలను, ముఖ్యంగా వరంగల్ అభివృద్ధి వెనుకబాటు, రోడ్లు, నాళాలు, డ్రైనేజీలు, పేదలకు ఇళ్లు, సిటీపై సమగ్ర అభివృద్ధి లేకపోవడం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల నుండి అధికార టిఆర్‌ఎస్ ముందు వరుసలో ఉంది. దీంతో ప్రతిపక్ష పార్టీలకు సవాల్‌గా మారింది. గత అసెంబ్లీ, స్ధానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు వెనుకంజలో ఉన్నాయి. ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో 4 బీజేపీ, 3 కాంగ్రెస్ స్థానాలు మినహా మిగతా ఎన్నికల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాయి.

గత ఎన్నికల ఫలితాలను అధికార టీఆరెస్ పునరావృతం చేయాలని చూస్తే, కాంగ్రెస్, బీజేపీలు ఈసారి గత చరిత్ర మార్చేపనిలో పడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్‌ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ కేంద్ర నిధులను దుర్వినియోగం చేసి దారి మళ్లించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. మొన్నటి వరదలను కాంగ్రెస్‌, బీజేపీ అస్త్రాలుగా మార్చుకున్నాయి. అయితే అధికార పార్టీ గత ప్రభుత్వాల అసమర్థత వల్లే వరంగల్ నగరానికి ఈ దుస్థితి అంటూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు.

మొత్తానికి ఈ సారి వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజల అవసరాలు, ఆర్థిక మాంద్యం, అభివృద్ధి ఈ విశయాలపైనే ఎన్నికల కోలాహలం ఉండనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో గెలిచి నిలిచేది ఎవరో తేలాలంటే ఎన్నికల సమరం వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories