నల్గొండ జిల్లాలో ఎదురెదురు పడ్డ రాజకీయ ప్రత్యర్ధులు...

Nalgonda: పరస్పర నినాదాలు చేసుకున్న ఇరు పార్టీల నేతలు...

Shireesha
Published on: 17 May 2022 4:01 PM IST
Political Opponents Confronted in Nalgonda | Congress vs TRS | Live News Today
X

నల్గొండ జిల్లాలో ఎదురెదురు పడ్డ రాజకీయ ప్రత్యర్ధులు...

Nalgonda: నల్గొండ జిల్లాలో ఇద్దరు రాజకీయ ప్రత్యర్ధులు ఎదురెదురుపడ్డారు. నకిరేకల్ నియోజకవర్గం నెల్లిబండలో జరుగుతున్న గ్రామ పండుగలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు హాజరయ్యారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు మాట్లాడుకుంటుండగానే వారి వారి అనుచరులు పరస్పరం నినాదాలు చేశారు.

గతంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీలో ఉండగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు అనుచరుడిగా కొనసాగారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఈ నేతల మధ్య రాజకీయ వైరం నెలకొన్నది. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎదురు పడటం కొంత ఆసక్తికరంగా మారింది.

Shireesha

Shireesha

Next Story