రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో పొలిటికల్ హీట్

Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ఉపఎన్నిక కోసం కత్తులు దూస్తున్న కమలదళం

Jyothi
Published on: 3 Aug 2022 8:59 AM IST
Political Heat in Telangana With the Resignation of Raj Gopal Reddy
X

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో పొలిటికల్ హీట్

Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పుట్టించింది. ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేస్తానని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఉపఎన్నిక పక్కా అనే సంకేతాలిచ్చారు. ఇప్పటికే దుబ్బాక, హుజురాబాద్ లో బై పోల్ లో సత్తా చాటిన కమలనాథులు మునుగోడులోనూ అదే ఫలితం రాబట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈటలను కట్టడి చేసేందుకు బ్రహ్మాస్త్రాలను సైతం వాడిన టీఆర్ఎస్ ఈ ఉపఎన్నికలో ఎలాంటి వ్యూహం అనుసరించనుందనేది హాట్ టాపిక్ గా మారుతోంది. అటు కాంగ్రెస్ కు మునుగోడు జీవన్మరణ సమస్యగా మారగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టున్న ఎదురుదెబ్బ తగిలితే పరిస్థితి ఏంటనేది కాంగ్రెస్ నేతల్లో గుబులు నెలకొంది.

Jyothi

Jyothi

Next Story