మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్

Munugode: టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు

Jyothi
Published on: 16 Aug 2022 10:34 AM IST
Political Heat In Munugode Politics
X

మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్

Munugodu: మునుగోడు పాలిటిక్స్ మరింత వేడెక్కుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిధులు, అభివృద్ధి పనులపై సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని.. బీజేపీ నేతలు అంటుండగా.. తెలంగాణ నుంచి వెళ్లేదే ఎక్కువంటున్నారు టీఆర్ఎస్ నేతలు.. అటు మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్ పెంచుతోంది. నేడు మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్‎ వస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 19 వరకు మండలాల వారికి కాంగ్రెస్ ఇంఛార్జ్‎లతో ఠాగూర్ భేటీ కానున్నారు. ఇంకోవైపు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి అరెస్ట్‎కు పోలీసులు యత్నించడం కలకలం రేపింది. అర్థరాత్రి తాడూరి వెంకట్‎రెడ్డి నివాసం దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి జగదీశ్‎రెడ్డి బెదిరింపుల్లో భాగమేన ఇదంతా అని చౌటుప్పల్ ఎంపీపీ ఆరోపిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story