ఏందన్నా.. అది ఆటోనా ? మినీ బస్సా ?

ఏందన్నా.. అది ఆటోనా ? మినీ బస్సా ?
x
Highlights

దేశవ్యాప్తంగా రోజుకి కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి మెయిన్ రీజన్ మాత్రం నిర్లక్షమేనని చెప్పాలి. పరిమితికి మించి ప్రయాణికులతో బండి లాగించేస్తుండడంతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా రోజుకి కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి మెయిన్ రీజన్ మాత్రం నిర్లక్షమేనని చెప్పాలి. పరిమితికి మించి ప్రయాణికులతో బండి లాగించేస్తుండడంతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అటు ప్రజలు కానీ ఇటు డ్రైవరన్నలు కానీ నిర్లక్ష్య వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు. అందుకు చక్కటి ఉదాహరణనే పైనున్న ఈ ఫోటో.. సహజంగా అయితే ఆటోలో పది మంది అతి కష్టం మీదా వెళ్ళొచ్చు కానీ ఓ ఆటో డ్రైవర్ ఏకంగా 17 మందితో పెద్ద సాహసమే చేశాడు. బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 17 మందితో వెళ్తున్న ఈ ఆటోను మహబూబ్‌నగర్‌ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయగా దీనిపైన తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ స్పందించింది.

":ఏందన్నా! అది ఆటో నా ?? మినీ బస్సా ?? 7 సీటరా లేక 14 సీటరా ?? ఆటో నీది !, ప్రాణం ఆ అమాయకులది !, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది ??" అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.. డ్రైవర్ కి సోయి లేకపోతే కనీసం అందులో ప్రయాణం చేసే ప్రయాణికులకైనా ఉండాలి కదా అని విమర్శిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ప్రభుత్వం సరిపడా రవాణా సదుపాయాలు కల్పిస్తే వారికి ఇలా ప్రయాణించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది. అన్ని రూట్లలో బస్సులు నడపాలని సూచనలు ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories