Guvvala Balaraju: మరో వివాదంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

* పోలీసులను రా అన్న గువ్వుల బాలరాజు * మర్యాదగా మాట్లాడాలని గువ్వల బాలరాజుకు పోలీసుల వార్నింగ్

Shilpa
Updated on: 9 Nov 2021 2:30 PM IST
Police Warning to Achampet MLA Guvvala Balaraju to Speak Politely
X

మరో వివాదంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(ఫైల్ ఫోటో)

Guvvala Balaraju: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులపై నోరుజారి మరోసారి అడ్డంగా బుక్కయ్యారాయన. సీఎం వాహనం వెనక తన వాహనాన్ని అనుమతించకపోవడంతో ఎమ్మెల్యే బాలరాజు పోలీసులపై ఫైర్ అయ్యారు.

ఏంట్రా అంటూ నోరుజారడంతో ఖాకీలు షాకిచ్చారు. ఏంట్రా అనడమేంటంటూ చుక్కలు చూపించారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగడంతో విషయం సీరియస్ అయింది. కొంచెం మంచిగా మాట్లాడండి రా అన్నంత మాత్రాన మీ గౌరవమేమీ పెరిగిపోదంటూ ఖాకీలు కౌంటరివ్వడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఇంతలో పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ఎమ్మెల్యేకు సర్దిచెప్పి పక్కకు పంపించారు.


Shilpa

Shilpa

Next Story