కాసేపట్లో సికింద్రాబాద్‌ కోర్టుకు అఖిలప్రియ

Arun Chilukuri
Published on: 6 Jan 2021 4:48 PM IST
కాసేపట్లో సికింద్రాబాద్‌ కోర్టుకు అఖిలప్రియ
X

హైదరాబాద్‌ బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ టీడీపీ నాయకురాలు అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కూకట్‌పల్లిలో అఖిలప్రియను అరెస్ట్‌చేసి బేగంపేట్‌ పీఎస్‌లో ఇంటరాగేషన్ చేశారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌‌రామ్‌తోపాటు అతని సోదరుడు చంద్రహాస్‌ పరారీలో ఉండటంతో వాళ్ల కోసం గాలిస్తున్నారు. ఇక, అఖిలప్రియ తమ్ముడు విఖ్యాత్‌రెడ్డి పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వైద్యపరీక్షల కోసం అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత సికింద్రాబాద్‌ కోర్టులో అఖిలప్రియను ప్రవేశపెట్టనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story