‌Hyderabad: రాత్రిలోగా రాజును పట్టుకోవాలని డెడ్‌లైన్‌ పెట్టుకున్న పోలీసులు

‌Hyderabad: సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా వెయ్యి మంది పోలీసుల గాలింపు

Sandeep Eggoju
Published on: 15 Sept 2021 5:12 PM IST
Police Speedup the Searching for Saidabad Accused
X

నిందితుడు రాజునూ రాత్రిలోగా పట్టుకుంటామన్న పోలీసులు (ఫైల్ ఇమేజ్)

‌Hyderabad: సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు దాదాపు పది టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రాజును వెతకడంలో బిజీబిజీగా ఉన్నాయి. ఇప్పటికే వెయ్యి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఉప్పల్‌ సిగ్నల్‌ దాటిన తర్వాత రాజు కనిపించకుండా పోయినట్లు పోలీసులు చెప్పారు. అదేవిధంగా ఓ వైన్ షాన్‌ దగ్గర నిందితుడు రాజు కదలికలను గుర్తించారు. రాజు వాడిన కవర్, టవల్‌ని స్వాధీనం చేసుకున్నారు. రాజుకు మద్యం అలవాటు ఉండటంతో కల్లు కంపౌండ్‌, వైన్‌ షాపులు, బస్‌ స్టాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story