బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం

Arun Chilukuri
Updated on: 12 Jan 2021 5:10 PM IST
Police Speed Up Investigation on Bowenpally Kidnap Case
X

హైదరాబాద్‌ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌ కేసులో ప్రధాన సూత్రదారి అఖిల ప్రియగా పోలీసులు గుర్తించారు. ఇందులో 19మంది నిందితుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారమే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు నిర్దారించారు. వీరిద్దరితో ఫోన్‌లో మాట్లాడిన వారి కోసం గాలిస్తున్నారు. కాల్ లిస్ట్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో పాటు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడికి అనుమతి ఇచ్చింది. దాంతో ఇవాళ అఖిల ప్రియను అధికారులు విచారించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story