వామన్‌రావు దంపతుల హత్య కేసులో మరొకరు అరెస్ట్

Arun Chilukuri
Published on: 24 Feb 2021 7:37 PM IST
వామన్‌రావు దంపతుల హత్య కేసులో మరొకరు అరెస్ట్
X

వామన్‌రావు దంపతుల హత్య కేసులో మరొకరు అరెస్ట్

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. హత్యా ఘటనలో మరో నిందితుడు ఉదరి లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. వామన్ రావు దంపతుల కదలికలను ఊదరి లక్ష్మయ్య ఎప్పటికప్పుడు కుంట శ్రీనుకు చేరవేసినట్లుగా విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. మరో వైపు హత్య కేసు నిందితులకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. నిందితులను కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. ఏడు రోజుల కస్టడికీ మంథని కోర్టు అనుమతి ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story