Assembly Elections 2023: తనిఖీలు మొదలు.. రూ.5 లక్షలు పట్టివేత..

Telangana Election Code: కారులో రూ. 5లక్షలు తరలిస్తుండగా పట్టివేత

Shekhar G
Published on: 9 Oct 2023 4:33 PM IST
Election Code To Come Into Effect In Telangana
X

Telangana Election Code: తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్‌

Telangana Election Code: తెలంగాణ సహా మరో 4 రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అయితే నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో అన్ని జిల్లాలో ఎన్నికల కోడ్‌, నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఎన్నికల కోడ్ అలా అమల్లోకి వచ్చిందో లేదో... పలు చోట్ల తనిఖీలు ప్రారంభం కాగా... ఖమ్మం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది.

జిల్లాలోని వైరాలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న 5 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో వైరాలో తనిఖీలు చేస్తుండగా.. ఓ కారులో 5 లక్షలు పట్టుకున్నారు. ఈ నగదును ఎవరు? ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడం, అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ డబ్బును సీజ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story