హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత

Police Seized 2 Crore Hawala Money in Hyderabad
x

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత

Highlights

Hyderabad: రూ.2 కోట్ల హవాలా నగదును సీజ్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

Hyderabad: హైదరాబాద్ నగరంలో చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌-12లో వాహనంలో తరలిస్తున్న 2కోట్ల నగదు బయటపడింది. డబ్బును తరలిస్తున్న సదరు వ్యక్తులు... డబ్బుకు సంబంధించిన సరైన సమాధానం, పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నగరంలో 10 రోజుల వ్యవధిలో 10 కోట్ల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories