భార్గవ్‌రామ్‌ కోసం గాలిస్తోన్న 3 ప్రత్యేక బృందాలు

భార్గవ్‌రామ్‌ కోసం గాలిస్తోన్న 3 ప్రత్యేక బృందాలు
x
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయ్. అఖిలప్రియను ప్రధాని నిందితురాలిగా చేర్చిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన...

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయ్. అఖిలప్రియను ప్రధాని నిందితురాలిగా చేర్చిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. అటు ఆమె భర్త భార్గమ్‌రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మరో పిటిషన్ వేయగా రేపు వాదనలు జరగనున్నాయ్.

బోయినపల్లి కిడ్నాప్ కేసు ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతోంది. హఫీజ్ పేట్ భూవివాదంలో సూత్రధారిగా మాజీమంత్రి భూమా అఖిలప్రియగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏ2గా ఉన్న ఆమెను ఏ1గా చేర్చారు. ఏ 2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ 3గా భార్గవ్‌రామ్‌తో పాటు ప్రధాన నిందితులుగా శ్రీనివాసరావు, సాయి,చంటి, ప్రకాశ్‌ పేర్లను పోలీసులు నమోదు చేశారు. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు చేర్చారు అధికారులు.

భూవివాదంలో ఏవీ సుబ్బారెడ్డి పెద్దఎత్తున లాభం పొందగా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు తెలిపారు. 2016లో సర్వే నంబర్‌ 80లో ప్రవీణ్‌ రావు 25ఎకరాల భూమి కొన్నారు. అది తమదంటూ ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవ్‌‌రామ్ లిటిగేషన్ పెట్టారు. ఈ వివాదంపై ఇరువర్గాల మధ్య చర్చలు జరగ్గా ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్ డబ్బు చెల్లించారు. సెటిల్‌మెంట్ విషయం తెలిసి ప్రవీణ్‌రావుపై అఖిలప్రియ ఫైర్ అయ్యారు. ఏవీ సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం చేసుకున్నారని వారించారు. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బు చెల్లించాలని అన్నారు.

ఐతే భూమి వ్యవహారంపై అటు బాధితుడు ప్రవీణ్ కుమార్ కుటుంబంకానీ పోలీసులు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ భూమికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నవారు పత్రాలు ఉంటే చూపించాలని తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇస్తామని ప్రవీణ్ రావు కుటుంబసభ్యులు అంటున్నారు. ఇక అటు ఈ కేసులో ఏ3గా ఉన్న భార్గవ్‌రామ్‌ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయ్. అతను బెంగళూరులో ఉన్నట్లుగా తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి గాలిస్తున్నారు.

కేసుకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు విచారించారు. ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని అఖిలప్రియకు తనకు మాటలు లేవని టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. హఫీజ్ పేట్ భూవివాదం చాలారోజుల నుంచి కొనసాగుతోందని నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ భూమి వ్యవహారంలో అసలు తలదూర్చలేదని వివరించారు. విచారణకు ఎప్పుడు విచారణకు ఆదేశించినా తాను సిద్ధమని వివరించగా 41 సీఆర్పీపీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇక అఖిలప్రియకు 14రోజుల రిమాండ్ విధించారు. బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేసినా అదనంగా మరో రెండు సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ కావడంతో బెయిల్ పిటిషన్ తిరస్కరించింది కోర్టు. ఇక అన్ని సెక్షన్లకు సంబంధించి మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు లాయర్లు సిద్ధమవుతున్నారు. ఇక అటు అఖిలప్రియను మెరుగైన వైద్యచికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని పిటిషన్‌లో తెలపగా అక్కడ అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని మెరుగైన చికిత్స అవసరమని అధికారులు చెప్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories