శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌.. పాతబస్తీలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌..

Police Restrictions: హైదరాబాద్‌ పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

Arun Chilukuri
Updated on: 24 Aug 2022 7:25 PM IST
Police Restrictions in Old City
X

శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌.. పాతబస్తీలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌..

Police Restrictions: హైదరాబాద్‌ పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈస్ట్‌జోన్‌, సౌత్‌జోన్లలో దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి షాపులు మూసివేయాలని ప్రకటించారు. మరోవైపు పాతబస్తీలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు భారీగా మోహరించాయి. ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు ఆర్‌ఏఎఫ్‌ బలగాలు.

ఇంకోవైపు శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష కొనసాగుతోంది. ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ ర‌వీంద్ర‌, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌లో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story