logo
తెలంగాణ

Drugs Case: పుడింగ్‌ పబ్‌లో పార్టీ ఎంట్రీకి వారం నుంచే పోలీసుల రెక్కీ

Police Requiem From Week to Party Entry in Pudding Pub
X

Drugs Case: పుడింగ్‌ పబ్‌లో పార్టీ ఎంట్రీకి వారం నుంచే పోలీసుల రెక్కీ

Highlights

Drugs Case: *పబ్‌కు వచ్చే రెగ్యులర్‌ కస్టమర్స్‌తో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్స్ పరిచయం

Drugs Case: ఫుడింగ్ మింక్ పబ్‌ లో పార్టీ ఎంట్రీకి వారం నుంచే పోలీసులు రెక్కీ నిర్వహించారు. పబ్‌కు వచ్చే రెగ్యులర్‌ కస్టమర్స్‌తో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్స్ పరిచయం చేసుకున్నారు. కానిస్టేబుల్స్‌కు పుడింగ్‌ పార్టీ ఇన్విటేషన్‌ను రెగ్యులర్‌ కస్టమర్స్‌ షేర్‌ చేశారు. వారంపాటు పబ్‌లో జరుగుతున్న తతంగాన్ని పోలీసులు గమనించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు పోలీసులు అందించారు. పక్కా ప్లాన్‌తో శనివారం అర్ధరాత్రి పుడింగ్‌ పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి జరిపారు.

మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మింక్ పబ్ కేసులో ఎఫ్ఐఆర్‌లో మొత్తం నలుగురు నిందితులు అనిల్, కిరణ్ రాజ్‌, అర్జున్ పేర్లు నమోదు చేశారు. పరారీలో ఉన్న అర్జున్, కిరణ్రాజ్‌ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సెలబ్రిటీలు, వీఐపీల పిల్లలను కేసు నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 148 మందిలో ఒక్కరిని కూడా కనీసం విచారణ చేయకుండా నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పబ్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చారు? అనే విషయాలను పోలీసులు తేల్చలేదు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడే పోలీసులు హడావిడి చేస్తారన్న అపవాదు వస్తోంది. నగరంలో డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. పబ్‌ల నిర్వహణపై పోలీసు, ఎక్సైజ్ శాఖ నిఘాల లోపమనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

Web TitlePolice Requiem From Week to Party Entry in Pudding Pub
Next Story