Bandi Sanjay: పాదయాత్ర నిర్వహించి తీరుతాం..

Police Rejected Bandi Sanjay Padayatra
x

Bandi Sanjay: పాదయాత్ర నిర్వహించి తీరుతాం.. 

Highlights

Bandi Sanjay: పాదయాత్రకు పోలీసులు కావాలనే ఆటంకం సృష్టిస్తున్నారంటున్న బీజేపీ

Bandi Sanjay: రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5 వ విడత పాదయాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. బండి పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సున్నిత ప్రాంతాల్లో పాదయాత్ర ఉండటంతో.. పర్మిషన్‌ ఇవ్వలేమని తేల్చిచెప్పారు. వాస్తవానికి రేపు భైంసా నుంచి 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాదయాత్రకు అనుమతి నిరాకరణపై బీజేపీ భగ్గుమంటోంది. పాదయాత్ర నిర్వహించి తీరుతామని.. ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. పోలీసులు కావాలనే ఆటంకం సృష్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో పాదయాత్ర ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 5 వ విడత పాదయాత్రను విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories