హరిహర కృష్ణ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు.. యువతిని సైతం విచారించే అవకాశం..

Police Custody: నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది.

Arun Chilukuri
Published on: 4 March 2023 11:04 AM IST
Police Recording Harihara Krishna Statement
X

హరిహర కృష్ణ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు.. యువతిని సైతం విచారించే అవకాశం..

Police Custody: నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు హరిహర కృష్ణను ఎల్బీనగర్ SOT కార్యాలయంలో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు విచారిస్తున్నారు. హరి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు.. నవీన్ హత్య కేసులో హరి ఒక్కడి పాత్రే ఉందా..? లేక ఇతరుల పాత్ర ఏమైనా ఉందా..? అనే దానిపై ఆరా తీస్తున్నారు. అంబర్‌పేట్ వైన్స్‌లో హరి, నవీన్‌తో పాటు ఉన్న మరో ఇద్దరి పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ మర్డర్ కేసులో కీలకంగా మారిన యువతిని సైతం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో హరిహర కృష్ణ మిత్రుడు హసన్‌ను పోలీసులు ఇప్పటికే విచారించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story