Hyderabad: జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని పలు పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు

Hyderabad: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10, 36, 45లోని పబ్బుల్లో సోదాలు

Jyothi
Updated on: 18 Dec 2023 9:00 AM IST
Police Raids in Hyderabad Pubs
X

Hyderabad: జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని పలు పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు

Hyderabad: హైదరాబాద్‌లోని పబ్బుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పబ్బుల్లో డ్రగ్స్‌, గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టిన పోలీసులు.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10, 36, 45లోని పబ్బుల్లో సోదాలు చేపట్టారు. తొలిసారి స్పిప్పర్‌ డాగ్‌లను వెంట బెట్టుకుని తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌తో పాటు బంజారాహిల్స్‌లోని పలు పబ్బుల్లోనూ సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ కలిపి సుమారు 17కు పైగా పబ్బుల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు.

అయితే.. పబ్‌లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తమకు ఎలాంటి డ్రగ్స్‌ అనుమానాస్పద వస్తువులు లభించలేదన్నారు. తమ ఉన్నతాధికారుల సూచనలతో తనిఖీలు చేస్తున్నామన్న పోలీసులు.. భవిష్యత్‌లో కూడా ఇలాంటివి జరుగుతాయన్నారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్‌ అమ్మకాలు జరిపినట్టు తెలిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.

Jyothi

Jyothi

Next Story