ములుగు జిల్లాలో కలకలం రేపుతున్న పోలీస్ పోస్టర్లు

X
Highlights
ములుగు జిల్లాలో పోలీస్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వెంకటాపురం, కొర్రవానిగూడెం ఏజెన్సీలో విస్తృత తనిఖీలు...
Arun Chilukuri16 Dec 2020 12:14 PM GMT
ములుగు జిల్లాలో పోలీస్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వెంకటాపురం, కొర్రవానిగూడెం ఏజెన్సీలో విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు మావోయిస్టుల కదలికలపై సమాచారం ఇవ్వాలంటూ పోస్టర్లు అతికించారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు బడె చొక్కరావు పేరుతో పోస్టర్ విడుదల చేసిన పోలీసులు. చొక్కరావును పట్టిస్తే 20లక్షల రూపాయల బహుమతి ఇస్తామంటూ ప్రకటించారు. ఒకవైపు పోలీసుల కూంబింగ్ మరోవైపు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వేయడంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు.
Web TitlePolice posters causing a stir in Mulugu district
Next Story