Hyderabad: తిరగబడ్డ దోపిడీ దొంగలు.. పెద్ద అంబర్‌పేటలో పోలీసుల కాల్పులు

Hyderabad: హైదరాబాద్‌ పెద్ద అంబర్‌పేటలో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై దోపిడీ గ్యాంగ్ దాడికి ప్రయత్నించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 July 2024 11:05 AM IST
Police Open Fire at Thieves Following Attack
X

Hyderabad: తిరగబడ్డ దోపిడీ దొంగలు.. పెద్ద అంబర్‌పేటలో పోలీసుల కాల్పులు

Hyderabad: హైదరాబాద్‌ పెద్ద అంబర్‌పేటలో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై దోపిడీ గ్యాంగ్ దాడికి ప్రయత్నించింది. పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. దీంతో పోలీసులు పార్థీ గ్యాంగ్‌పై కాల్పులు జరిపారు. దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో ముఠా దాడికి పాల్పడింది. ఇటీవల జాతీయ రహదారిపై పార్కింగ్‌ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో నల్గొండ పోలీసులు అప్రమత్తమై నిఘా పెట్టారు. ఆ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా యత్నించారు. పెద్ద అంబర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్‌ వద్దకు వచ్చేసరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కత్తులతో ఎదురుదాడి చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story