దమ్ముంటే నన్ను పట్టుకోండి.. పోలీసులకే సవాల్ విసిరిన లగ్జరీ కార్ల దొంగ..

Luxury Car: దేశవ్యాప్తంగా ఖరీదైన కార్లను చాకచక్యంగా చోరీచేసే సత్యేంద్రను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు.

Arun Chilukuri
Published on: 23 April 2022 2:48 PM IST
Police nab serial car thief Satyendra Singh Shekhawat
X

దమ్ముంటే నన్ను పట్టుకోండి.. పోలీసులకే సవాల్ విసిరిన లగ్జరీ కార్ల దొంగ.. 

Luxury Car: దేశవ్యాప్తంగా ఖరీదైన కార్లను చాకచక్యంగా చోరీచేసే సత్యేంద్రను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లోనూ ఓ స్టార్ హోటల్లో లగ్జరీ కారు దొంగతనానికి సంబంధించి విచారించేందుకు సత్యేంద్రను బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. రాజస్థాన్‌కు చెందిన ఆర్మీ జవాను కుమారుడు సత్యేంద్ర 2003 నుంచి కార్లను దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు.

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 61 చోరీకేసుల్లో సత్యేంద్ర నిందితుడిగా ఉన్నాడు. అధునాతన టెక్నాలజీతో కార్లను దోచుకెళ్లే సత్యేంద్ర పోలీసులకు సవాల్ విసిరాడు. వీడియోకాల్ చేసి తనను పట్టుకోవాలనే సవాలును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టకేలకు సత్యేంద్రను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story