జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో దర్యాప్తు వేగవంతం.. ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలిస్తున్న పోలీసులు

Hyderabad: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు.

Arun Chilukuri
Updated on: 5 Jun 2022 7:30 PM IST
Police Investigation Speedup Into Hyderabad Gang Rape Case
X

జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో దర్యాప్తు వేగవంతం.. ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలిస్తున్న పోలీసులు

Hyderabad: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఎమ్మెల్యే రఘునందన్ రిలీజ్ చేసిన ఆధారాల్లో ఎమ్మెల్యే కొడుకు వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ వీడియోను లీగల్ ఒపినియన్‌కోసం పంపించారు. ఎమ్మెల్యే కొడుకును సైతం నిందితుడిగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే కొడుకు విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసుల విచారణ కీలకంగా మారనుంది. ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేరిస్తే ఈ కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరుకోనుంది.

బాలిక అత్యాచార కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో సీజ్‌ చేసిన ఇన్నోవా, బెంజ్ కారును క్లూస్ టీమ్స్ పరిశీలించాయి. ఇందులో పలు కీలక ఆధారాలను ఫోరెన్సిక్‌ బృందాలు గుర్తించాయి. బెంజ్‌ కారులో తలవెంట్రుకలు, చెప్పు, చెవి రింగును గుర్తించారు. అలాగే ఫింగర్ ప్రింట్స్‌ను సైతం క్లూస్ టీమ్స్ సేకరించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story