Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనపై పోలీసుల దర్యాప్తు

Gandhi Hospital: మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ * ఉద్యోగి ఉమామహేశ్వరరావుతో పాటు సెక్యూరిటీ గార్డులను విచారణ

Sandeep Eggoju
Updated on: 17 Aug 2021 2:13 PM IST
Police Investigation on Gandhi Hospital Incident
X

గాంధీ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ సాగిస్తున్నారు. ఉద్యోగి ఉమామహేశ్వరరావుతో పాటు సెక్యూరిటీ గార్డులను విచారించారు. నిన్న వైద్య పరీక్షల అనంతరం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి, ఎవరు అత్యాచారం చేశారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో వైద్య పరీక్షల నివేదిక కీలకంగా మారనుండగా.. గాంధీలోని సీసీ కెమెరాలు, బాధితుల కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు.. బాధితురాలి అక్కకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story