Vaman Rao: గట్టు వామన్ రావు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం

Police Investigation Is in full Swing on Vaman Rao death case
x
వామన్ రావు (ఫైల్ ఫొటొ)
Highlights

Vaman Rao: హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

Vaman Rao: గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. బిట్టు శ్రీనును అరెస్ట్ చేసి.. విచారణలో పలు కీలక విషయాలు రాబట్టారు. మరోవైపు ఫోరెనిక్స్, క్లూస్‌ టీంలు ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.

మంథనిలో జరిగిన డబుల్ మర్డర్‌ కేసులో నిందితులకు కారు, కత్తులు అందజేసిన బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్టుశీనుని విచారించి.. కీలక విషయాలు వెల్లడించారు. 2016 నుంచి మంథనిలో పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగుతున్న బిట్టుశ్రీనుపై గతంలో వామన్ రావు ఆరోపణలు చేశారు. అంతేకాదు ట్రస్టుపై కేసులు కూడా వేసినట్లు బిట్టు శ్రీను తెలిపాడు. ఈ వివాదంలోనే వామన్ రావుపై బిట్టు శ్రీను కక్ష పెంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

అటు కుంట ‌శ్రీనుతో కూడా వామనరావుకు విభేదాలున్నట్లు విచారణలో బయటపడింది. గ్రామ పంచాయతీలో బిట్టు శ్రీను ట్రాక్టర్ పై ఫిర్యాదు చేసి అధికారులపై వామన్‌రావు ఒత్తిడి చేసి తీసి వేయించాడు. ఒక ఫోన్ కాల్ విషయంలోనూ కుంట శ్రీనివాస్ పై కేసు పెట్టించారు. గుంజపడుగు గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం అడ్డుకోవడంతో పాటు కుంట శ్రీను అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని నిలిపివేయించినట్లు బిట్టు శీను వాంగ్మూలంలో చెప్పినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు.

తమ వ్యక్తిగత విషయాలను ఒకరితో ఒకరు పంచుకునే స్నేహం ఉన్న బిట్టుశీను, కుంటశీను.. వామనరావు హత్యకు కుట్ర పన్నారు. నాలుగు నెలల క్రితమే మర్డర్‌కు ప్లాన్ చేసినా.. ఫెయిల్ అయ్యింది. ఈనెల 17న వామన్ రావు దంపతులు మంథని కోర్టుకు రాగా కుంట శీను బిట్టు శ్రీనుకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బిట్టు శ్రీను చిరంజీవికి ఫోన్ చేసి కత్తులు తీసుకురావాలని చెప్పాడు. చిరంజీవికి కారిచ్చి కుంట శీను దగ్గరకు పంపించినట్లు వెల్లడించారు పోలీసులు.

మరోవైపు ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి క్లూస్‌ టీం ఫోరెనిక్స్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. న్యాయస్థానంలో కేసు నిలబడిలే పక్కా ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. హత్య జరిగిన రోజు కుంట శ్రీను, చిరంజీవి కదిలికలను తెలుసుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీని సేకరించినట్లు తెలుస్తోంది. ఎవరెవరిని కలిశారని ఆరా తీస్తున్నారు.

నిందితుల కాల్‌ డేటాపై కూడా పోలీసులు దృష్టి సారించారు. హత్య జరిగిన రోజు నిందితులు ఎవరెవరితో మాట్లాడారు. ఏం మాట్లాడారో తెలుసుకుంటున్నారు. సేకరించిన వీడియో, ఆడియో ఫుటేజీని ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపించారు. ఎక్కడా సాంకేతిక లోపాలు ఉండకుండా పోలీసులు ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హత్యకు వాడిన కత్తుల విషయంలోనూ అసలు కథను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories