Hyderabad: శిల్పాచౌదరిని రెండోరోజు విచారిస్తున్న పోలీసులు

Hyderabad: కిలాడీ లేడీ శిల్పాచౌదరిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు

Sandeep Reddy
Updated on: 11 Dec 2021 12:44 PM IST
Police get custody of Shilpa Chowdary again
X

శిల్పాచౌదరిని రెండోరోజు విచారిస్తున్న పోలీసులు(ఫైల్-ఫోటో)

Hyderabad: కిలాడీ లేడీ శిల్పాచౌదరిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులతో వాదనకు దిగిన శిల్పారెడ్డి తన డబ్బును రాధికారెడ్డితో పాటు మరికొంతమందికి ఇచ్చినట్టు చెప్పింది. అయితే ఇందులో వాస్తవం లేదని రాధికారెడ్డి స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. విచారణలో భాగంగా శిల్పా మరికొంతమంది పేర్లను ప్రస్తావించింది. దీంతో వీరిని కూడా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి పోలీసులు విచారించనున్నారు.

అలాగే రాధికారెడ్డి, కొంపల్లి మల్లారెడ్డికి మధ్యవర్తిత్వంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. వందల కోట్ల డబ్బులు మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నా కేవలం 18 కోట్ల వరకే లెక్కలు తేలడంతో మిగిలిన డబ్బంతా ఏమైందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story