సీఎం కేసీఆర్ సభ.. రేపు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

సీఎం కేసీఆర్ సభ.. రేపు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు
x
Highlights

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనమిది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఎల్బీ స్టేడియం వద్ద వాహనాలు ఉండవు. కంట్రోల్‌ రూమ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు, అబిడ్స్‌,గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు ఎస్‌బీఐ, చాపెల్‌ రోడ్డువైపు మళ్ళించనున్నారు.

అటు బషీర్‌బాగ్‌, అబిడ్స్‌ నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, కోఠివైపు, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్‌వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్‌ మీదుగా వెళ్తాయి. ఇక ఎల్బీ నగర్, పాత బస్తీ నుంచి వచ్చే వాహనాలను పీపుల్స్ ప్లాజా వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు గేట్-జి వద్ద దిగాలని, వాహనాలను నిజాం కళాశాల వద్ద పార్కింగ్‌ చేయాలన్నారు.

సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ చాలా సీరియస్ కసరత్తు చేస్తోంది. ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పి కొట్టేలా కేసీఆర్ మాట్లాడతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాట్ల కోసం టీఆర్ఎస్ యంత్రాంగం భారీగా సన్నాహాలు చేసుకుంటోంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు లక్షల మంది ఈ సభకు హాజరవుతారన్న అంచనాలున్న నేపధ్యంలో రెండు లక్షల మాస్క్ లను ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సభకు వచ్చే వారు శానిటైజ్ చేసుకుని మాస్క్ ధరించాల్సి ఉంటుంది. కేసీఆర్ సభ కోసం భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.. స్టేడియంలో మూడు స్టేజీలు ఏర్పాటు చేస్తారు. మొదటి స్టేజిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. రెండో స్టేజిని కళాకారులకోసం ఏర్పాటు చేయగా, మూడో స్టేజిపై పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఉంటారు. వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. గ్రౌండ్ బయట ఉన్న వారికోసం 12 స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories